ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్య భవితవ్యంపై చర్చలు మరింత జోరందుకున్నాయి. ముంబయి ఇండియన్స్‌తో ఆయన కొనసాగుతారా లేక జట్టును విడిచిపెడతారా అన్నదానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర డిబేట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబయి ఇండియన్స్ మధ్య ఓ పెద్ద ట్రేడ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ ప్రతిపాదిత డీల్‌లో హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ ఇచ్చి, ప్రతిగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత రెండేళ్ల క్రితం వరకూ జైస్వాల్ ఐపీఎల్‌లో అత్యంత హాట్ టాపిక్‌గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌లో అతడికి భవిష్యత్ నాయకత్వ బాధ్యతలు దక్కుతాయని కూడా అంచనాలు ఉండేవి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారడంతో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ దక్కింది. అలాగే వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల ఎంట్రీతో జైస్వాల్ ప్రాధాన్యం కొంత తగ్గినట్లు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ జట్టులో కొనసాగితే తన కెరీర్ గ్రాఫ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే జైస్వాల్ ముంబయి ఇండియన్స్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ముంబయి ఇండియన్స్‌లో కూడా నాయకత్వ భవితవ్యంపై స్పష్టత లేదు. తిలక్ వర్మ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ, జైస్వాల్ లాంటి స్టార్ యువ ఆటగాడు జట్టులోకి వస్తే పరిస్థితులు మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అతడికి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టులో నమ్మదగ్గ యువ భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ మాత్రమే కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కారణంగా ముంబయి మేనేజ్‌మెంట్ జట్టులో మరింత మంది యువ భారత బ్యాటర్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే, జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఉపయోగించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు ఉంటే జట్టుకు మంచి బ్యాలెన్స్ వస్తుందని ముంబయి మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















