అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టో మార్కెట్ వేగంగా పెరిగినట్లు సమాచారం.
సంబంధిత వర్గాల ప్రకారం, 2025లో ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు యూఏఈలోని అబుదాబీ రాజ కుటుంబానికి చెందిన షేక్ తహనూన్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ప్రతినిధులతో ట్రంప్ కుటుంబ సంస్థ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 49 శాతం వాటా కొనుగోలు చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ మొత్తంలో సగం ముందస్తుగా చెల్లించగా, అందులో ట్రంప్ కుటుంబానికి సుమారు 187 మిలియన్ డాలర్లు వెళ్లినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సంతకం చేసినట్లు వెల్లడైంది. ఈ డీల్ కారణంగా అమెరికా నుంచి యూఏఈకి ఏఐ హార్డ్‌వేర్ సరఫరా జరగనుందని తెలుస్తోంది. గతంలో జో బైడెన్ పాలనలో దీనికి ప్రయత్నించినా అనుమతి లభించలేదని కథనాలు చెబుతున్నాయి.
‘స్పై షేక్’గా పేరుగాంచిన షేక్ తహనూన్ యూఏఈ అధ్యక్షుడి సోదరుడు కాగా, జాతీయ భద్రతా సలహాదారుడిగా, ప్రభుత్వ వెల్త్ ఫండ్ అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జేరెడ్ కుష్నర్ కలిసి 2024లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు. అలాగే ఎరిక్, డొనాల్డ్ జూనియర్‌లు కలిసి అమెరికన్ బిట్‌కాయిన్ ఇన్‌కార్పొరేటెడ్ పేరుతో బిట్‌కాయిన్ మైనింగ్ కంపెనీని కూడా స్థాపించారు.
గత ఏడాది ఏప్రిల్‌లో ఈ సంస్థ పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సమక్షంలో ‘పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















