Donald Trump కుటుంబ పెట్టుబడులపై అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ కుటుంబం రక్షణరంగ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి తెచ్చాయి.అధ్యక్షుడిగా కొనసాగుతున్న మూడు నెలల వ్యవధిలోనే అమెరికా స్టాక్ మార్కెట్లో వేల సంఖ్యలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల వల్ల లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వివాదాస్పదమైంది.ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో Lockheed Martin, General Dynamics, Northrop Grumman వంటి అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థల షేర్లు ఉన్నట్లు వెల్లడైంది.
అలాగే NVIDIA చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై నిబంధనలు సడలించిన తర్వాత ట్రంప్ కుటుంబం సుమారు 6 మిలియన్ డాలర్ల మేర లావాదేవీలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విమర్శలు మరింత పెరిగాయి.అమెరికా చట్టాల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధానాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టరాదు. అయితే అధ్యక్షుడికి మాత్రం ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. అయినప్పటికీ అధ్యక్షుడి పెట్టుబడులు నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చని ఎథిక్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక JD Vance ట్రంప్‌కు మద్దతుగా స్పందించారు. “ట్రంప్ కంప్యూటర్ ముందు కూర్చొని స్వయంగా ట్రేడింగ్ చేయరు. ఆయన పోర్ట్‌ఫోలియోను థర్డ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి” అని పేర్కొన్నారు.ఇదే సమయంలో Apple, Boeing, Tesla వంటి సంస్థల్లో కూడా ట్రంప్ కుటుంబానికి పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడైంది. చైనా పర్యటనలో ఆయా సంస్థల సీఈఓలు కూడా ట్రంప్ వెంట ఉండటం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















