అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యవహారశైలితో వార్తల్లో నిలిచారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, చివరకు మైక్రోఫోన్‌ను తీసి కిందపడేసి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌కు ఇరాన్ యుద్ధం, అమెరికా అంతర్గత రాజకీయాలు, గత ఎన్నికల వివాదాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తన ఆరోపణలకు ఆధారాలు ఏమిటని హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ట్రంప్, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మరోసారి ఆరోపించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యం కూడా తన వాదనకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల కారణంగానే కౌంటింగ్ ఆలస్యమవుతోందని హోస్ట్ వివరణ ఇవ్వగా, ట్రంప్ ఆ వాదనను తిరస్కరించారు.
ప్రశ్నలు, ప్రత్యుత్తరాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇక చాలు.. థ్యాంక్యూ’’ అంటూ మైక్రోఫోన్‌ను తొలగించి కిందపడేసి ఇంటర్వ్యూను ముగించారు. హోస్ట్ ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరినా, ఇప్పటికే చాలాసేపు సమయం ఇచ్చానంటూ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ స్పందనపై మద్దతు, విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా రాజకీయ వర్గాల్లో ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















