తలుపులు సరిగ్గా వేసి ఉన్నా.. నగల దుకాణంలో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయమవుతుండటంతో యజమానికి అనుమానం మొదలైంది. దుకాణంలోకి ఎవరైనా చొరబడుతున్నారా? అనే సందేహంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఈ ఘటనలో ఓ ఎలుక రాత్రివేళ దుకాణంలోకి ప్రవేశించి బంగారు నగలను తన కలుగులోకి లాక్కెళ్లినట్లు గుర్తించారు. ఎలుక కలుగును పరిశీలించగా 10 ఉంగరాలు, 3 గొలుసులు కనిపించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటిలో ఓ వజ్రాభరణం కూడా ఉన్నట్లు సమాచారం.
ఎలుక బంగారు నగలను ఎలా తీసుకెళ్లిందో సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించిన దుకాణ యజమాని ఆశ్చర్యానికి గురయ్యారు. మనుషులే దొంగతనం చేస్తున్నారని భావించిన చోట.. చివరకు ఓ ఎలుకే ‘బంగారం దొంగ’గా తేలడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















