నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓటర్లు తమ నిర్ణయంతో పాలనపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తక్కువ కాలంలోనే విశేష విజయాన్ని సాధించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు భారీగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు.
అలాగే తమిళనాడులో అన్నాడీఎంకే, భాజపా పార్టీలు కూడా బలమైన పోరాటం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ విజయం సాధించినందుకు ఆ నాయకత్వానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు.ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల చైతన్యాన్ని మరోసారి నిరూపించాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మంచి పాలన అందిస్తే ప్రజలు మళ్లీ మళ్లీ అవకాశమిస్తారని, లేకుంటే కఠినంగా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు మార్పును బలంగా కోరుకున్నారని వ్యాఖ్యానించారు.
అస్సాం, పుదుచ్చేరిల్లో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న భాజపాకు ఆయన అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజల మనసు గెలుచుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.ఇక భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి వంటి నాయకుల కృషిని కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యంలో ఓటర్లే అసలైన నిర్ణేతలు అని మరోసారి రుజువు చేశాయని ఆయన అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















