యూట్యూబ్‌లో చూసిన ఓ దాగుడుమూతల ఛాలెంజ్‌ను అనుసరించాలనుకున్న ఇద్దరు చిన్నారులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. హస్తినాపూర్‌లోని బి-బ్లాక్ కాలనీకి చెందిన 7, 11 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఆదివారం మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత కూడా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
మొదట చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులకు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత ఓ ఫామ్‌హౌస్ సమీపంలో పిల్లలు దాక్కొని ఉండటాన్ని గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. యూట్యూబ్‌లో ‘సీక్రెట్ హౌస్’ పేరుతో 24 గంటల పాటు దాగుడుమూతలు ఆడే ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను తాము చూశామని పిల్లలు తెలిపారు. ఆ వీడియోలో మాదిరిగానే ఇంట్లో వారికి దొరకకుండా తాము కూడా దాక్కోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే చిన్నారులు ఆన్‌లైన్‌లో చూసే ఛాలెంజ్ వీడియోల ప్రభావం, వాటిని అనుకరించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలు వీక్షించే ఆన్‌లైన్ కంటెంట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















