శ్రీశైలంలోని వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పరిశీలించగా మృతదేహాలు కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
మృతుల్లో ఇద్దరు హాలులోని ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. మరో ముగ్గురు మహిళలు స్నానాల గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), గోగుల ఆదిలక్ష్మి (50), మణికంఠ (15)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సత్రం నిర్వాహకుల వివరాల ప్రకారం.. గత నెల 28న సుధాకర్, ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలానికి వచ్చారు. రోజుకు రూ.800 చొప్పున అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రంలోని గదిలో బస చేశారు. ఎక్కువ రోజులు ఉండటానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వారు అక్కడే కొనసాగినట్లు తెలుస్తోంది.
సుధాకర్‌కు వివాహం కాలేదని, ఆయన ఇద్దరు చెల్లెళ్లకు వివాహమైనప్పటికీ భర్తలకు దూరంగా ఉంటూ కుటుంబంతోనే ఉన్నారని అధికారులు తెలిపారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఘటనపై శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తుల వసతి గదుల్లో బసకు సాధారణంగా 48 గంటలకే అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ రోజులు గదిని కేటాయించిన అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారమే గదులు కేటాయించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
మరోవైపు వడ్డెర సత్రం నిర్వహణపై కూడా వివాదం నెలకొంది. గతంలో దేవస్థానం అధికారులు సత్రాన్ని సీజ్ చేయగా.. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం యాజమాన్యం తిరిగి నిర్వహణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సత్రం నిర్వహణకు సంబంధించిన వరుస వివాదాలపై విచారణ కొనసాగుతోందని ఆలయ ఛైర్మన్, ఈవో వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















