అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకపై అమెరికాలో జన్మించిన పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రులు తమ పౌరసత్వం, ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన రుజువులను కూడా సమర్పించాల్సి రావచ్చని తెలుస్తోంది.
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్, బర్త్ టూరిజాన్ని నిరుత్సాహపరిచే చర్యల్లో భాగంగా గత నెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగశాఖ పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
ప్రస్తుతం అమెరికాలో జన్మించిన పిల్లల పాస్‌పోర్ట్ కోసం తల్లిదండ్రులు తమకు, పిల్లలకు ఉన్న సంబంధాన్ని నిరూపించే పత్రాలతోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును సమర్పించాలి. దరఖాస్తులో పౌరసత్వానికి సంబంధించిన వివరాలను పేర్కొంటే సరిపోతుంది. అయితే తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించడం ప్రస్తుతం తప్పనిసరి కాదు.
కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే.. పిల్లల పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన సమయంలో తల్లిదండ్రుల పౌరసత్వం, ఇమిగ్రేషన్ స్థితికి సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు కోరే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలో నివసిస్తున్న వలస కుటుంబాలపై ఈ మార్పు ప్రభావం చూపే అవకాశముంది.
అమెరికన్ పౌరసత్వం అర్థాన్ని, విలువను కాపాడతామని ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలోనూ అందుకు అనుగుణంగా మార్పులు ఉంటాయని విదేశాంగశాఖ పేర్కొన్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















