టాలీవుడ్‌లో మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పేర్లతో కూడిన ఓ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.ఆ కార్డులో వివాహ తేదీ ఫిబ్రవరి 26గా పేర్కొనగా, మార్చి 4న బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు వివరాలు ఉన్నాయి. ఈ కార్డు నిజమా? లేక ఫ్యాన్‌మేడ్ డిజైన్ మాత్రమేనా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.
విజయ్, రష్మిక ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల విజయంతో వీరి జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే తమ వ్యక్తిగత జీవితంపై ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.గత ఏడాది అక్టోబరులో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలపై కూడా ఎటువంటి ధృవీకరణ రాలేదు. ఇప్పుడు వెడ్డింగ్ కార్డు ప్రచారం మరింత చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే, మరోసారి తెరపై విజయ్–రష్మిక జోడీ కనిపించనుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డు పై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ఇది కేవలం ప్రచారంగానే భావించాల్సి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















