అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు మరికొన్ని గంటల్లో సాకారం కానున్నాయి. టాలీవుడ్ స్టార్ Vijay Deverakonda మరియు నేషనల్ క్రష్ Rashmika Mandanna వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సోషల్‌మీడియాను కుదిపేస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అందమైన నగరం Udaipur వేదికగా ఈ రాయల్ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం.
ఇప్పటికే రెండు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు వేడుకల కోసం ఉదయ్‌పుర్ చేరుకున్నారు. తాజాగా విజయ్ స్విమ్మింగ్ పూల్ వద్ద తీసిన ఫొటోను పంచుకోగా, రష్మిక గ్రీన్ థీమ్‌తో అలంకరించిన డిన్నర్ టేబుల్ ఫొటోను షేర్ చేశారు. ఆ టేబుల్‌పై “విరోష్” అని రాసి ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
వివాహ వేడుకలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈరోజు సంగీత్, మెహందీ వేడుకలు, రేపు హల్దీ కార్యక్రమం, ఫిబ్రవరి 26న ప్రధాన వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఉదయ్‌పుర్‌లోని లగ్జరీ వేదిక ITC Mementos Udaiprలో ఈ పెళ్లి జరగనుందని సమాచారం. సుమారు 100 మంది సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్‌గా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















