విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ నేషనల్ గేమ్స్-2026 ఇంట్రా గ్రూప్ కాంపిటిషన్ (గ్రూప్-ఎఫ్) పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్. శాస్త్రి క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంబికాపూర్, భువనేశ్వర్, కోరుకొండ, సంబల్పూర్, బిలాస్పూర్ సైనిక్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్రీడా కవాతు నిర్వహించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో కవాతులో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.
క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు విజయమే లక్ష్యంగా తమ ప్రతిభను ప్రదర్శించాలని ప్రిన్సిపల్ ఎస్.ఎస్. శాస్త్రి సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని పేర్కొన్నారు.
నేషనల్ గేమ్స్‌లో భాగంగా పరుగు పందెం, వాలీబాల్, బాస్కెట్‌బాల్ తదితర క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీపడ్డారు.కార్యక్రమంలో సైనిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వింగ్ కమాండర్ కిరణ్, క్రీడా కోచ్‌లు, పీఈటీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















