ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఏళ్ల తరబడి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, మరోవైపు సంక్షేమ పథకాలకు మాత్రం నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొంది. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. ప్రజాధనం చెల్లింపుల్లో ప్రాధాన్యతలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.
భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసం అధికారులు కోర్టుకు వచ్చి నిధుల కొరత ఉందని చెబుతున్న పరిస్థితిని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఒకవైపు నిధుల కొరత ఉందంటూనే మరోవైపు రుణాలు తీసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయడం సరైన విధానమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థంగా నిర్వహించి వాటిని లాభాల్లోకి తీసుకువస్తే, ఆ లాభాలను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు చట్టబద్ధత ఏమిటో వివరించాలని కూడా ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఆర్థికశాఖ అనుమతులు మాత్రమే సరిపోతాయా? లేక చట్టపరమైన ఆధారం అవసరమా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరింది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారని, శాసనసభ ఆమోదం కూడా ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలను నిరోధించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు ఖర్చు చేయడానికి చట్టబద్ధమైన అనుమతులు అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరుపై మరింత సమగ్రంగా విచారణ జరపాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై పూర్తి స్థాయిలో వాదనలు విన్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















