సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్లో ఓ భార్య తన భర్తను రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు వెంకటేశం ఆసిఫాబాద్లో కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజమణి సీనియర్ ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయమై దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన రాజమణి రోకలిబండతో వెంకటేశంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశం అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం రాజమణిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులు, దంపతుల మధ్య ఉన్న వివాదాలపై దర్యాప్తు చేస్తున్నారు. రిటైర్మెంట్కు కొద్దిరోజుల ముందే జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















