నటుడు Yash భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ (Ramayana)లో నటిస్తుండగా, మరోవైపు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యశ్ ఈ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘టాక్సిక్’ టీజర్ చూసి చాలా మంది ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకున్నారని కానీ, అది అలాంటి చిత్రం కాదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం, కొత్త కథాంశంతో రూపొందుతోందని తెలిపారు.
‘టాక్సిక్’ గురించి మాట్లాడుతూ, “ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌కు స్పష్టమైన విజన్ ఉంది” అని అన్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
ఇక ‘రామాయణ’ గురించి మాట్లాడుతూ, Ranbir Kapoorతో తన కాంబినేషన్‌పై స్పందించారు. ఇద్దరి విజన్ ఒకేలా ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద బలం అని చెప్పారు. అయితే ‘రామాయణ’ పార్ట్ 1లో తమ ఇద్దరి మధ్య సీన్స్ ఉండవని యశ్ స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ దీపావళికి విడుదల కానుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















