పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం యెమెన్‌పై తీవ్రంగా పడుతోంది. హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మద్దతుతో ఉన్న ప్రభుత్వ బలగాల మధ్య దాడులు కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రాణభయంతో వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. చేతికి అందిన సామగ్రిని తీసుకుని కుటుంబాలతో కలిసి సుదూర ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.
2015-2022 మధ్య సాగిన తీవ్ర అంతర్యుద్ధం యెమెన్‌లో ఇప్పటికే భారీ మానవతా సంక్షోభానికి దారితీసింది. ఆ కాలంలో ఏర్పడిన క్షామ పరిస్థితుల కారణంగా సుమారు 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనాలు ఉన్నాయి. తాజా ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఆహారం, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ అరేబియా గాలిలోనే అడ్డుకుంది. అయితే నిర్వీర్యం చేసిన డ్రోన్‌కు సంబంధించిన శిథిలాలు కిందపడటంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు సౌదీ పౌర రక్షణ బలగం గురువారం వెల్లడించింది. ఈ ఘటనతో ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















