మధ్యతరగతి ఇళ్లలో పెరిగే ప్రతి కుర్రాడికి ఒక కామన్ గోల్ ఉంటుంది.. చదువుతో పాటు స్కూల్ లైఫ్ ముగిసేలోపు ఒక ప్రేమకథను తన ఖాతాలో వేసుకోవాలని. ప్రవీణ్ కథ కూడా సరిగ్గా అక్కడే మొదలవుతుంది. అయితే, అతని విపరీతమైన అల్లరి వల్ల క్లాసులో అమ్మాయిలంతా అతన్ని ఒక ‘డేంజర్ జోన్’లా చూస్తుంటారు తప్ప, కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. అయినా సరే, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రవీణ్ చేసే ప్రయత్నాలే ఈ సినిమాను ఫుల్ ఎంటర్టైనర్‌గా మార్చాయి.
ఈ ప్రయాణంలో గంగవల్లి, ప్రేషిక, సోనాల్ అనే ముగ్గురు అమ్మాయిలతో ప్రవీణ్‌కు ఏర్పడిన పరిచయాలు కేవలం సరదా ముచ్చట్లతోనే ముగిసిపోవు. ప్రతి పరిచయం అతనికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఒకరు తొలి ప్రేమలోని మధురానుభూతిని చూపిస్తే, మరొకరు బ్రేకప్ వల్ల కలిగే నరకాన్ని పరిచయం చేస్తారు. ఇంకొకరు సమాజం వేసే అవమాన ముద్రలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు.
కేవలం ప్రేమాయణాల చుట్టూనే కాకుండా, ఇంట్లో ఉండే అమ్మానాన్నల భావోద్వేగాలను కూడా ఈ కథ అంతే బలంగా స్పృశించింది. కొడుకు అల్లరిని భరిస్తూనే, వాడి భవిష్యత్తు కోసం ఆరాటపడే ఉన్నికృష్ణన్, సరోజ పాత్రలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. ప్రేమ మత్తులో పడి తల్లిదండ్రుల కలలను పక్కన పెట్టే యువతకు, తిరిగి ఆ బాధ్యతను ఎలా గుర్తుంచుకోవాలో ఈ చిత్రం హృద్యంగా చెబుతుంది. చివరకు తన వ్యక్తిగత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని, తన తల్లిదండ్రుల తలెత్తుకునేలా ప్రవీణ్ ఏం చేశాడు అనేదే ఈ ‘యూత్’ ప్రయాణం వెనుక ఉన్న అసలు సందేశం. ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఎమోషనల్ రైడ్ స్ట్రీమింగ్ కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















