ఒక దశలో ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పాలని భావించినా, ప్రపంచకప్‌లో ఆడాలన్న కల అతడిని ముందుకు నడిపించింది. 40 ఏళ్ల వయసులో కూడా పోరాట స్పూర్తిని చూపిస్తూ కప్ బరిలోకి దిగిన కాబోవెర్డె వెటరన్ గోల్‌కీపర్ వోజినా ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతడు అసాధారణ ప్రదర్శనతో జట్టును కాపాడాడు. ఈ మ్యాచ్ 0-0 డ్రాగా ముగియడంలో వోజినా పాత్ర అత్యంత కీలకం. స్పెయిన్ 27 సార్లు గోల్ ప్రయత్నించినా, ఒక్క బంతి కూడా నెట్‌లోకి వెళ్లలేదు. కాబోవెర్డె రక్షణ విభాగం బలంగా నిలవడంతో పాటు, గోల్ దగ్గర వోజినా నిలిచిన “అడ్డుగోడ” ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది.
వోజినా జీవితంలో భావోద్వేగ కోణం కూడా ఉంది. అతడి ప్రతిభను చిన్ననాటి నుంచి ప్రోత్సహించిన తాత, అమ్మమ్మ ఇప్పటికే మరణించారు. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లి ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడలేకపోయింది. ఈ లోటు అతడిని మరింత బలంగా ముందుకు నడిపిందని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
25 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన వోజినా, అనేక దేశాల క్లబ్‌లకు ఆడాడు. 2012లో కాబోవెర్డె జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఒక దశలో రిటైర్మెంట్ ఆలోచించినప్పటికీ, ప్రపంచకప్ కల అతడిని మళ్లీ మైదానంలోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు స్పెయిన్‌పై అతడి అద్భుత ప్రదర్శనతో వోజినా రాత్రికి రాత్రే గ్లోబల్ సెలబ్రిటీగా మారాడు. ప్రపంచకప్‌కు ముందు సుమారు 50 వేలుగా ఉన్న అతడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు, ఇప్పుడు 24 లక్షలకు పైగా చేరడం అతడి క్రేజ్‌ను చూపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















