ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను విస్తృతంగా వినియోగించేందుకు సేల్స్‌ఫోర్స్‌కు చెందిన ఏజెంట్‌ఫోర్స్ ప్లాట్‌ఫాంను ఉపయోగించనుంది. దీంతో రిఫండ్, టికెట్‌పై ప్రయాణికుల పేర్ల సవరణ వంటి సేవలు గతంతో పోలిస్తే చాలా వేగంగా పూర్తికానున్నాయి.
ప్రస్తుతం రిఫండ్ ప్రక్రియకు గరిష్ఠంగా 14 రోజుల వరకు సమయం పడుతుండగా.. కొత్త ఏఐ ఆధారిత వ్యవస్థతో ఈ సమయం కేవలం 4 గంటలకు తగ్గనుంది. అలాగే టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుడి పేరును సవరించేందుకు గతంలో మూడు రోజుల వరకు పట్టేది. ఇకపై ఈ ప్రక్రియను 30 నిమిషాల్లోనే పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ప్రయాణికులు ఒకే ఈ-మెయిల్‌లో పలు సమస్యలను ప్రస్తావించినా.. వాటిని విడివిడిగా గుర్తించి సంబంధిత పరిష్కారాలను ఒకే సమాధానంలో అందించే సామర్థ్యం ఏఐ వ్యవస్థకు ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. దీంతో కస్టమర్ సేవలపై సిబ్బందిపై ఉన్న పని భారం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగంగా పరిష్కారం లభించనుంది.
మరోవైపు ముంబయిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అధ్యక్షతన ఎయిరిండియా బోర్డు సమావేశం జరిగినట్లు సమాచారం. సంస్థలో కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న టెవోల్డే గెబ్రెమరియం వేతనంతో పాటు పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో టెవోల్డే బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 4న దిల్లీ విమానాశ్రయం నుంచి ముగ్గురు ఇటాలియన్ పౌరులు ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేయకుండానే దేశం విడిచి వెళ్లిన ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియా ఉన్నతాధికారులను ఆదేశించింది. కర్తవ్య భవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించింది. ఇప్పటికే పౌర విమానయాన శాఖ కూడా ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















