తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఈ పెద్దపులి, ఏడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ కలకలం సృష్టించింది.గోదావరి పరీవాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, పొలాల్లో సంచరిస్తూ రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో మొత్తం 8 మూగజీవాలను ఈ పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శుక్రవారం ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల్లో కనిపించిన పులి, కూర్మాపురం గ్రామంలో పాలచర్ల రాజుకు చెందిన శిథిలగృహంలోకి చొరబడింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అప్రమత్తమయ్యారు.పులిని పట్టుకునేందుకు మత్తు ఇంజక్షన్ ప్రయోగానికి నిపుణులు సిద్ధమవుతుండగా, మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పులి శిథిలగృహం నుంచి బయటకు వచ్చి వరి పొలాల్లోకి పరుగులు తీసింది. అక్కడి నుంచి గ్రామ శివార్లలోని ఇళ్ల సమీపానికి చేరి, అనంతరం సమీప దుర్గమ్మ గుడి దగ్గర ఉన్న కొలగాని సత్తిబాబుకు చెందిన పశువుల పాకలోకి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంది.
పులి కదలికలను అంచనా వేసిన నిపుణులు పశువుల పాక చుట్టూ, సమీప భవనాల మధ్య భద్రతా వలలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పాకలో ఉన్న రెండు గేదెలపై పులి దాడికి ప్రయత్నించగా అవి తీవ్రంగా ప్రతిఘటించడంతో పులి బయటకు వచ్చింది. మొదటిసారి మత్తు ఇంజక్షన్ ప్రయోగం విఫలమైనప్పటికీ, సుమారు వంద మీటర్ల దూరంలో రెండోసారి ప్రయోగించిన ఇంజక్షన్ విజయవంతమైంది.మత్తు ప్రభావంతో చెరువు గట్టు వద్ద పులి పడిపోవడంతో అధికారులు వెంటనే దానిని బంధించి రాజమహేంద్రవరం తరలించారు. పులి పట్టుబడటంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు పరిస్థితిని పూర్తిగా సమీక్షించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















