కుమారుడు ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని తల్లిదండ్రులు కలలు కన్నారు. అయితే ఆ ఆశలు ఆవిరైపోయాయి. ఉన్నత విద్య కోసం హరియాణా వెళ్లిన ఓ యువ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాట్రావత్ తండాకు చెందిన అంగోత్ చందూనాయక్, శారద దంపతులు వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అంగోత్ శివ (19) హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్రలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 16న ఉదయం తరగతులకు హాజరైన శివ, మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లాడు. మిగతా విద్యార్థులతో కలిసి భోజనానికి వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు. అనంతరం సహ విద్యార్థులు గదికి వెళ్లి చూడగా, ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడుశివ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు..
సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివ ఆత్మహత్య చేసుకునే స్వభావం కలిగిన వాడికాదని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కోరుతున్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని హరియాణా అధికారులతో సమన్వయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















