ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షేక్ షరీన్ బేగం, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
బెంజ్ సర్కిల్‌లోని ఆదిత్య కాలేజ్ విద్యార్థులతో కలిసి బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ప్రత్యేక హెల్మెట్ ఫ్లాష్ మాబ్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచిస్తూ కౌన్సిలింగ్‌లు, అవగాహన పోస్టర్లు, ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
హెల్మెట్ ధరించడం మాత్రమే కాకుండా, దాని స్ట్రాప్‌ను సక్రమంగా బిగించడం కూడా ప్రాణ రక్షణకు అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో III ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. కిషోర్ బాబు గారు, ఇన్‌స్పెక్టర్ శ్రీ రామారావు గారు, WSI సరళ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ వీర్రాజు గారు, కొరియోగ్రాఫర్ స్వామి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















