దేశంలో బొగ్గు దిగుమతులను కనీసం 30 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సూచించింది. దేశీయ బొగ్గును ఎక్కువగా వినియోగిస్తూ ‘బ్లెండింగ్’ విధానాన్ని పెంచడం ద్వారా ఈ ఏడాది సుమారు 15 మిలియన్ టన్నుల దిగుమతులను తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రపంచంలో రెండో అతిపెద్ద థర్మల్ బొగ్గు దిగుమతిదారుగా ఉన్న భారత్ 2025లో ఇండొనేషియా, దక్షిణాఫ్రికా, రష్యా వంటి దేశాల నుంచి దాదాపు 50 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. అయితే దేశీయంగా సరిపడా నాణ్యమైన బొగ్గు లభిస్తున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది.
దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో సుమారు నాలుగింట మూడొంతులు బొగ్గుపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల సరఫరాలో అంతరాయం లేకుండా దేశీయ బొగ్గును సమర్థంగా వినియోగించుకోవాలని విద్యుత్ ప్లాంట్లకు ప్రభుత్వం వివరిస్తోంది.
వేసవి డిమాండ్‌కు ముందస్తు చర్యలు
Coal India Limited వేసవి కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంటూ, ప్లాంట్లకు అదనపు బొగ్గు సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 25 నాటికి కంపెనీ వద్ద 115 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మార్చి 31 నాటికి ఇవి మరింత పెరిగే అవకాశముందని తెలిపింది.
ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్ల వద్ద సుమారు 55 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. గూడ్స్ షెడ్లు, వాషరీలు, పోర్టులతో కలిపి మొత్తం నిల్వలు 175.5 మిలియన్ టన్నులకు చేరాయి. వేసవి నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఈ నిల్వలు కీలకంగా మారనున్నాయి..దేశీయ ఉత్పత్తిని పెంచుతూ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక వ్యయాన్ని తగ్గించడంతో పాటు, ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















