భౌగోళిక మరియు రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వివిధ దేశాల పెరుగుతున్న రుణభారం, అలాగే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ స్వర్ణ మండలి (WGC) ముఖ్య కార్యనిర్వహణాధికారి డేవిడ్ టెయిట్ తెలిపారు.అతనిప్రకారం, భవిష్యత్తులో పెన్షన్, బీమా ఫండ్‌ల వంటి పెద్ద సంస్థల నుంచి పసిడి డిమాండ్ ఇంకా పెరగే అవకాశముంది. గత మూడు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ప్రతి ఏడాదీ సుమారు 1000 టన్నుల పసిడి కొనుగోలు చేశారని, భవిష్యత్తులో కూడా ఈ కొనుగోళ్లు కొనసాగుతాయని ఆయన అంచనా వేశారు.
భారతదేశం వెనకబడి ఉంది: పసిడి కొనుగోళ్లలో, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకులతో పోలిస్తే, భారత కేంద్ర బ్యాంకు వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనకబడినందున, నిల్వలను పెంచుకునే అవకాశముంది.గిరాకీ ధోరణుల విషయానికి వస్తే, గతేడాది ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ రికార్డు గరిష్ఠాలకు చేరిందని, ధరలు పెరగడం వలన ఆభరణాల కొనుగోలు తగ్గినప్పటికీ, పెట్టుబడుల రూపంలో బిస్కెట్లు, నాణేలకు డిమాండ్ 17% పెరిగింది అని తెలిపారు.
పసిడి ధరలు గణనీయంగా తగ్గాలంటే, అమెరికాలో 6-7% వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రభుత్వ రుణాల తగ్గుదల అవసరం. అయితే, ఈ పరిస్థితులు జరగే అవకాశం “చాలా తక్కువ”ని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















