దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. ఇంధన ధరలను నియంత్రించేందుకు చమురుపై ఉన్న కొన్ని ఆంక్షలను తొలగించే నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. అలాగే యుద్ధం ముగిసే అవకాశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరగడం పెట్టుబడిదారుల్లో సానుకూల భావనను పెంచాయి. దీంతో ప్రీఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ సుమారు 800 పాయింట్లు ఎగిసింది.
ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 77,888 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 24,119 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా నమోదైంది. నిఫ్టీ సూచీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం ఒక బ్యారెల్‌కు 119 డాలర్ల వరకు పెరిగినప్పటికీ ప్రస్తుతం 89 డాలర్లకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు సుమారు 8 శాతం మేర ఎగబాకాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులు మార్కెట్ ఊగిసలాటలను తట్టుకోగలవని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















