భారత మహిళల హాకీ జట్టు మరో గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన భారత్, క్వాలిఫయర్స్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 1-0తో ఇటలీని ఓడించింది.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు గట్టిగా పోటీ పడ్డాయి. భారత్ గోల్స్ కోసం వరుసగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇటలీ డిఫెన్స్ బలంగా నిలిచింది. 18వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇటలీ గోల్‌కీపర్ లూసియా అద్భుతంగా అడ్డుకుంది. అలాగే 29వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ కొట్టిన షాట్ కూడా లక్ష్యాన్ని తాకలేదు.
ద్వితీయార్థంలో ఇటలీ ఎదురుదాడికి దిగింది. అయితే భారత గోల్‌కీపర్ బిచూ దేవి అద్భుత సేవ్‌తో ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది. మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లేలా కనిపిస్తున్న సమయంలో 40వ నిమిషంలో భారత్‌కు గోల్డ్ెన్ ఛాన్స్ దక్కింది. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న మనీషా చౌహాన్ బలమైన షాట్‌తో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది.
చివరి క్వార్టర్‌లో భారత్‌కు మరో రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చినప్పటికీ వాటిని గోల్స్‌గా మార్చలేకపోయింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇటలీకి పెనాల్టీ కార్నర్ లభించినా.. భారత డిఫెన్స్ దాన్ని సమర్థంగా అడ్డుకుని విజయాన్ని ఖాయం చేసింది.ఇప్పుడు శనివారం జరిగే ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ 2-0తో స్కాట్లాండ్‌ను ఓడించింది. లోటి బింగామ్ (25వ నిమిషం), డార్సీ బౌర్నీ (29వ నిమిషం) గోల్స్‌తో ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరింది.
ఇతర మ్యాచ్‌ల్లో వేల్స్ 2-1తో కొరియాను, ఉరుగ్వే 3-0తో ఆస్ట్రియాను ఓడించాయి. శుక్రవారం జరిగిన పోటీలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహ్మద్ అజహరుద్దీన్, సీతక్క మరియు యువ షూటర్ ఇషా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.భారత్ ఫైనల్లో కూడా విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















