తాళాలు, బ్యాగులు వంటి వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోయే పరిస్థితులు చాలా మందికి ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో సహాయం చేయడానికి యాపిల్ సంస్థ రూపొందించిన చిన్న ట్రాకింగ్ పరికరం ఎయిర్‌ట్యాగ్. ఇప్పుడు యాపిల్ దీని కొత్త వర్షన్ ఎయిర్‌ట్యాగ్ 2ను పరిచయం చేసింది.ఈ కొత్త మోడల్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా మొదటి ఎయిర్‌ట్యాగ్‌తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులను గుర్తించే సామర్థ్యం కలిగేలా దీనిని రూపొందించారు. దీంతో తాళాలు, బ్యాగులు, లగేజ్ వంటి వస్తువులను మరింత సులభంగా ట్రాక్ చేయవచ్చు.
ఇంకా ఒక ముఖ్యమైన మార్పు ప్రిసిషన్ ఫైండింగ్ ఫీచర్‌ను యాపిల్ వాచ్‌లకు కూడా అందుబాటులోకి తీసుకురావడం. అంటే ఐఫోన్ దగ్గరలో లేకపోయినా, వాచ్ ద్వారానే ఎయిర్‌ట్యాగ్‌కు అటాచ్ చేసిన వస్తువులను గుర్తించవచ్చు.
వాచ్‌లో ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
- ముందుగా వాచ్‌లో సైడ్ బటన్‌ను నొక్కి కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయాలి.
- కిందికి స్క్రోల్ చేసి Edit ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
- పై ఎడమ మూలలో కనిపించే Add పై నొక్కాలి.
- అక్కడ Find AirTag అనే కంట్రోల్‌ను ఎంపిక చేసి యాడ్ చేయాలి.
ఒకసారి ఈ ఫీచర్‌ను యాడ్ చేసిన తర్వాత కంట్రోల్ సెంటర్‌లో ఎయిర్‌ట్యాగ్‌కు సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది. ఉదాహరణకు బ్యాక్‌ప్యాక్ లేదా బ్యాగ్‌కు ఎయిర్‌ట్యాగ్‌ను అటాచ్ చేస్తే, వాచ్ ద్వారా దాని స్థానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















