అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ (Oracle) రాబోయే నెలల్లో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులు, భారీ డేటా సెంటర్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పునర్నిర్మాణ వ్యయాల కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,600 కోట్లు) కేటాయించినట్లు కంపెనీ ఇటీవల తన త్రైమాసిక ఫలితాల అనంతరం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) కు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ పునర్నిర్మాణ నిధులు మొత్తం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు) కు చేరాయి. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉండటం గమనార్హం.
పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాల భాగంగా సంస్థ వేలాది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి పెట్టుబడులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఆర్‌బీసీ విశ్లేషకుడు రిషి జలూరియా అభిప్రాయం ప్రకారం, వచ్చే త్రైమాసికంలో ఉద్యోగుల కోత లేకుండా పునర్నిర్మాణ ఖర్చులను పెంచడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ‘పునర్వ్యవస్థీకరణ’ అనే పదాన్ని కంపెనీలు ఉద్యోగాల కోతకు సంకేతంగా ఉపయోగిస్తుంటాయని ఆయన తెలిపారు.ఇప్పటికే గత ఏడాది ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఒరాకిల్ అమెరికా, కెనడా, భారత్‌లలో 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో మధ్యస్థాయి ఉద్యోగులపై ప్రభావం పడినట్లు సమాచారం.తాజాగా చేపట్టనున్న ఉద్యోగాల కోత ఏ విభాగాల్లో ఉంటుంది? ఎంతమందిపై ప్రభావం పడుతుంది? అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















