ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పీఏ చందన్ సింగ్ జీనా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో తాను నిర్వహిస్తున్న రెండు పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) శాశ్వత ఆహ్వానితుడి పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన కారణంగా పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రావత్ వెల్లడించారు. తన పీఏపై వచ్చిన ఆరోపణలను తాను నమ్మడం లేదని, చందన్ సింగ్ జీనా కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. అయితే దర్యాప్తులో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (UKSSSC) నియామక పరీక్షలో ఓఎంఆర్ షీట్లను మార్చి అక్రమాలకు పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దెహ్రాదూన్‌లోని జీనా నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.32 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల బంగారు నాణేలు, ఆభరణాలు, 12 ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
అంతేకాకుండా జీనా, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలను సైతం ఈడీ స్తంభింపజేసింది. హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చందన్ సింగ్ జీనా ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఆయన పీఏగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















