కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట కరీంనగర్‌లో మహా పాదయాత్ర ప్రారంభించారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు కూడా ఆయన వెంట పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కరీంనగర్ మేయర్ పదవి భాజపా కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు. ఆ మొక్కును నెరవేర్చేందుకు ఇప్పుడు ఈ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సుమారు 10 వేల మంది కార్యకర్తలతో కలిసి సంజయ్ ఈ యాత్రను ప్రారంభించారు. భక్తి, రాజకీయ ఉత్సాహం కలిసిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు పొందేందుకు చేపట్టిన ఈ పాదయాత్రకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews

















