పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్ పట్టు మరింత కఠినమవుతోంది. తాజాగా, తమ శత్రుదేశ నౌకలను తప్పించి మిగతా నౌకలకు అనుమతిస్తామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు.
ఈ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఒక్కొక్కటి 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.18 కోట్లు) చొప్పున ఫీజు వసూలు చేయడం ఇప్పటికే ప్రారంభమైంది, అని ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది తెలిపారు. ఈ చర్య ద్వారా జలసంధిలో ఇరాన్ బలాన్ని ప్రపంచానికి చూపించగలమని ఆయన పేర్కొన్నారు.
48 గంటల్లో హర్మూజ్ జలసంధి తిరిగి తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చిన పరిస్థితిలో, బరూజెర్ది చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అదేవేళ, తమ విద్యుత్ ఇన్ఫ్రా పై అమెరికా దాడి చేస్తే, ఇరాన్ ఇజ్రాయెల్ ఎనర్జీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోనున్నట్లు హెచ్చరించారు.
తమ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే, పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులు ధ్వంసమయ్యే అవకాశం ఉందని, హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















