దేశంలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను సగటున 50% పెంచే ప్రతిపాదనపై వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నుంచే అమల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలు 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కు చేరే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, తెలంగాణలో 119 నుంచి 179కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263కు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. లోక్‌సభ సీట్లలో కూడా ఏపీలో 25 నుంచి 38కు, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుదల ఉండవచ్చు.
మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ముందడుగుగా ఈ సీట్ల పెంపు చేపడుతున్నట్లు సమాచారం. డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
2027లో జరగనున్న జనగణన ప్రాథమిక లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, 2029 ఎన్నికలకు కొత్త రాజకీయ మ్యాప్ సిద్ధం చేయాలన్నది కేంద్రం ప్రణాళిక. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరగనున్నాయి.
ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య అసమానతలు రాకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెంచే ఫార్ములాను ప్రభుత్వం అనుసరిస్తోంది. దీంతో ప్రస్తుత రాజకీయ సమతుల్యత కొనసాగుతుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















