ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేయనున్నారు.
మే 12 నుంచి 20 వరకు జరిగిన ఎప్‌సెట్ పరీక్షలకు దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన ఈ పరీక్ష ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఫలితాలు వెలువడాల్సి ఉండగా, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు అధికారులు వేచి చూశారు.
ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తికావడంతో, ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















