కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో కొంత అస్వస్థతకు గురైన ఆమెను మంగళవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం, సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆమెకు మూత్రనాళం మరియు ఉదరానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, వాటిపై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షిస్తూ, అవసరమైన అన్ని వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచి పరిశీలించిన తర్వాతనే డిశ్చార్జ్ చేసే అవకాశముందని సమాచారం.ఇక పార్టీ వర్గాలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటం రాజకీయ వర్గాల్లో కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















