ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan పేర్కొన్నారు. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత N. Chandrababu Naidu, ప్రధాన కార్యదర్శి Nara Lokesh, రాష్ట్ర అధ్యక్షుడు Palla Srinivasa Raoతో పాటు నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీగా తెదేపాను అభివర్ణించారు. N. T. Rama Rao స్థాపించిన ఈ పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాక్షేత్రంలో బలంగా నిలిచిందని పేర్కొన్నారు.
తెదేపా ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు, క్లిష్ట పరిస్థితులు, రాజకీయ పోరాటాలు ఉన్నప్పటికీ, చంద్రబాబు తన విశాల అనుభవంతో వాటిని అధిగమించి పార్టీ శ్రేణుల్లో నమ్మకం నింపారని తెలిపారు.రాజకీయ లక్ష్యాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఎజెండాగా తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజాపక్ష పోరాటాల్లో చంద్రబాబు తనదైన ముద్ర వేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















