డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు కుదరకపోవడం మరియు సొంత గుర్తుపై పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా తన పార్టీకి కనీసం 10 నుంచి 15 స్థానాలు కావాలని కమల్ పట్టుబట్టినప్పటికీ, ఇప్పటికే ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించిన కారణంగా డీఎంకే ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
అంతేకాకుండా కేటాయించే తక్కువ సీట్లను కూడా ‘ఉదయ సూర్యుడు’ గుర్తుపైనే పోటీ చేయాలని షరతు పెట్టడం ఎంఎన్ఎం శ్రేణులకు మింగుడుపడలేదు. చివరకు పార్టీ ఉనికిని కాపాడుకోవడమా లేక కూటమి ధర్మాన్ని పాటించడమా అన్న సందిగ్ధంలో కమల్ పోటీకి దూరంగా ఉండి కేవలం మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపారు.
అయితే ఈ నిర్ణయం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పెద్ద చిచ్చు పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేస్తామన్న నమ్మకంతో ఒక్కొక్కరు రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న సుమారు 60 మంది ఆశావహులు ఇప్పుడు కమల్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీయే లేనప్పుడు తాము కట్టిన డబ్బులను వెంటనే వాపస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూరు వంటి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాల్లో నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. వరుసగా ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల పార్టీ క్యాడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని, కేవలం ప్రచారానికే పరిమితమైతే రాజకీయ భవిష్యత్తు ఏంటని కమల్‌ను ప్రశ్నిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిని గొప్ప త్యాగంగా అభివర్ణిస్తున్నా, అభ్యర్థుల నుంచి వస్తున్న ఈ డబ్బు వెనక్కు ఇవ్వాలనే డిమాండ్లు కమల్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















