వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పానీయాల్లో ఆమ్ పన్నా ఒకటి. దీన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెన్నో…
వడదెబ్బ నుంచి రక్షణ: ఎండ తీవ్రత నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతను నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో చెమట రూపంలో శరీరం కోల్పోయే లవణాలను తిరిగి భర్తీ చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల: ఇందులోని పెక్టిన్, ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి ఆకలిని పెంచుతాయి.
రోగనిరోధకత: పచ్చి మామిడిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
శరీరానికి శక్తి: ఎండ వల్ల కలిగే అలసటను తగ్గించి, తక్షణ శక్తిని అందిస్తుంది. విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుంది.
ఎలా చేయాలంటే… పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి, లోపలి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. గుజ్జుకు సరిపడా పంచదార, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొద్దిగా పుదీనా ఆకులు కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటిలో కలిపి, ఐస్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఆమ్ పన్నా సిద్ధం. మిక్సీ ద్వారా సజావుగా మిక్స్ చేసి, చల్లని నీటిలో కలిపి ఐస్ ముక్కలతో సర్వ్ చేయాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















