భారతీయ రైల్వే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. BCom/CA/CMA/MBA (Finance) విద్యార్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా జరుగుతుంది.
పోస్టులవారీ వివరాలు…
పోస్టు: అసిస్టెంట్ (ఎన్‌ఈ-5)
ఖాళీలు: 16
అర్హత: 60 శాతం మార్కులతో బీకామ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేయాలి.
వేతన శ్రేణి: నెలకు రూ.21,000 – 74,000.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో. సీబీటీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నాపత్రంలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో మ్యాథమెటిక్స్/ న్యూమరికల్ ఎబిలిటీ – 20 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్/ జనరల్ ఇంటెలిజెన్స్, రైల్వే/ ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి 10 ప్రశ్నల చొప్పున వస్తాయి. పార్ట్-బీలో.. కార్పొరేట్ అకౌంటింగ్, ఇన్‌కమ్‌ట్యాక్స్ లాస్, కార్పొరేట్ లాస్, కాస్ట్ అకౌంటింగ్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ బిజినెస్, మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, బ్యాంకింగ్, ఇన్‌స్యూరెన్స్ మొదలైన అంశాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
- సీబీటీలో కనీసార్హత మార్కులు సాధించిన వారిని ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. ఇందులో అర్హత పొందినవారిని వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)
ఖాళీలు: 7
అర్హత: 60 శాతం మార్కులతో బీకామ్, సీఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్).
వేతన శ్రేణి: నెలకు రూ.40,000 – 1,40,000.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో ఉంటుంది. సీబీటీ 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రంలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-ఏ 50 మార్కులకు అసిస్టెంట్ పోస్టు ప్రశ్నాపత్రం మాదిరిగానే ఉంటుంది. పార్ట్-బీకి 50 మార్కులు. ఇందులో అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆడిటింగ్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, క్యాపిటల్ మార్కెట్స్, డైరెక్ట్ ట్యాక్స్ లాస్, రిటర్న్స్ ఈ ఫైలింగ్.. మొదలైన అంశాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
- సీబీటీలో అన్‌రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఎస్సీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్ 30 శాతం, ఎస్టీ 25 శాతం కనీసార్హత మార్కులు పొందాలి.
- సీబీటీకి 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. సీబీటీలో చూపిన ప్రతిభతో ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
వివరాలు
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, మాజీ సైనికోద్యోగులకు ఫీజు ఉండదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2026
సీబీటీ: జూన్, 2026లోవేతనం: ₹40,000 – ₹1,40,000/నెల
ఎంపిక విధానం:
CBT (100 మార్కులు)
ధ్రువపత్రాల పరిశీలన
ఇంటర్వ్యూ
మెడికల్ టెస్ట్
CBT భాగాలు:
Part-A: 50 మార్కులు (Assistant పోస్టు ప్రశ్నాపత్రం మాదిరిగానే)
Part-B: Accounting, Financial Reporting, Auditing, Professional Ethics, Cost & Management Accounting, Capital Markets, Direct Taxes, Returns Filing (50)
సీబీటీ & ఇంటర్వ్యూ వెయిటేజీ: CBT 80%, ఇంటర్వ్యూ 20%
ఎంపిక: CBTలో అర్హత సాధించిన 3 మంది ఒక్కో పోస్టుకి ఇంటర్వ్యూకు ఎంపిక. అర్హత పొందినవారికి వైద్య పరీక్ష తర్వాత తుది ఎంపిక.
కనీస అర్హత CBT: UR/EWS – 40%, SC/OBC-NCL – 30%, ST – 25%వివరాలు
CBT: జూన్ 2026లో నిర్వహించబడుతుంది
వయసు: 18–30 సంవత్సరాలు
OBC-NCL: +3 సంవత్సరాలు
SC/ST: +5 సంవత్సరాలు
Divyang: 10–16 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు: ₹500
SC/ST, Divyang, Transgender, Ex-Servicemen – ఫీజు రాయలేదు
దరఖాస్తు చివరి తేది: 01.05.2026
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















