పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌కు ఆర్థికంగా కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై మళ్లీ భారీ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరగడం గమనార్హం.
ఈ దాడుల్లో ఖర్గ్ ద్వీపంతో పాటు రహదారులు, రైల్వే వంతెనలు, మిలిటరీ లక్ష్యాలను అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మార్చిలో కూడా ఈ ప్రాంతంలో దాడులు జరగడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది.
పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖర్గ్ ద్వీపం ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం. దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే జరుగుతుండటంతో, ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, తాజా పరిణామాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఓపికగా ఉన్నామని, ఇక తమ సహనం నశించిందని పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వారి మిత్ర దేశాలపై ప్రతిదాడులకు సిద్ధమని హెచ్చరించింది. చమురు, గ్యాస్ సరఫరాలను లక్ష్యంగా చేసుకుని భారీ అంతరాయం కలిగిస్తామని ప్రకటించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















