ప్రొటీన్లు అత్యంత సంక్లిష్ట పదార్థాలు. వీటికి మూలం అమైనో ఆమ్లాలు. ఇవి రసాయన బంధాలతో కలిసి ప్రొటీన్లుగా ఏర్పడతాయి. ఒక ప్రొటీన్‌లో వందలాది అమైనో ఆమ్లాలు ఉంటాయి తెలుసా? అందుకే వీటిని శరీర నిర్మాణంలో ఇటుకల వంటివని భావిస్తుంటారు. మన శరీరంలో ఇవి చేసే పనులకు అంతే లేదు. కణాలు జన్యువులను ‘చదివేలా’ చేయటమే కాకుండా ఆ సమాచారంతో కొత్త కణాలు, అణువులు పుట్టుకురావటానికి తోడ్పడతాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా కొత్త ప్రొటీన్ల తయారీకీ దోహదం చేస్తాయి. కణాలకు, కణజాలాలకు ఒక ఆకృతిని ఇచ్చేవీ ప్రొటీన్లే. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి హానికరాలకు అంటుకుపోయి, వాటిని ఒంట్లోంచి బయటకు వెళ్లగొట్టేలా చేస్తాయి కూడా. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఆహారం ద్వారా తగినంత ప్రొటీన్ లభించేలా చూసుకోవాలి.
బాల్యం నుంచీ..
శిశువులకు, చిన్నారులకు చాలావరకూ తల్లిపాలు, పాల ఉత్పత్తుల నుంచి ప్రొటీన్ లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారం తీరుతెన్నులు మారుతూ వస్తుంటాయి. అదృష్టవశాత్తూ శాకాహారం, మాంసాహారం రెండింటి నుంచీ తగినంత ప్రొటీన్ లభిస్తుంది. మాంసాహారంలో గుడ్డు, చేపలు, మాంసం.. శాకాహారంలో పప్పులు, గింజపప్పులు, విత్తనాలు, పాలు, పెరుగు వంటివి ప్రొటీన్ అందిస్తాయి. మాంసాహార ప్రొటీన్‌లో మన శరీరానికి అత్యవసరమైన అన్ని అమైనో ఆమ్లాలూ ఉంటాయి. అదే శాకాహార ప్రొటీన్‌లో కొన్ని అమైనో ఆమ్లాలు ఉండవు. అలాగని చింతించాల్సిన పనిలేదు. వేర్వేరు రకాల పదార్థాలు తినటం ద్వారా వీటిని భర్తీ చేసుకోవచ్చు. మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రొటీన్ జీర్ణాశయం నుంచి మొదలై పేగుల వరకూ విచ్ఛిన్న మవుతూ వస్తుంది. ప్రొటీన్ విచ్ఛినమైనప్పుడు అమైనో ఆమ్లాలుగా మారుతుంది. ఈ ఆమ్లాలు రక్తంలో కలిసి, కాలేయానికి, అక్కడ్నుంచి శరీరమంతా పంపిణీ అవుతాయి.
పెద్దమొత్తం అవసరం లేదు
ప్రొటీన్ ఎంత మంచిదైనా పెద్ద మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదనపు ప్రొటీన్‌ను మన శరీరం నిల్వ ఉంచుకోలేదు. ఇది కొవ్వుగా మారటమో లేదా కిడ్నీల ద్వారా బయటకు వెళ్లటమో జరుగుతుంది. ముఖ్యంగా కిడ్నీజబ్బు గలవారికి అధిక ప్రొటీన్ చాలా కీడు చేస్తుంది. ప్రొటీన్ విచ్ఛినమైనప్పుడు పుట్టుకొచ్చే యూరియా, అమ్మోనియా, క్రియాటినైన్, యూరిక్ ఆమ్లం వంటి వాటిని బయటకు పంపటానికి కిడ్నీలు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.
తగ్గితే ప్రమాదం
ప్రొటీన్ మరీ తగ్గితే కండరాల బలహీనత, నిస్సత్తువ, జబ్బుల నుంచి త్వరగా కోలుకోకపోవటం వంటివి తలెత్తుతాయి. వెంట్రుకలు, గోళ్లు పెళుసుబారతాయి కూడా.
గుడ్డు మంచిదే అయినా
క్రీడాకారులు, బాడీబిల్డర్లు కొన్నిసార్లు గుడ్లు ఎక్కువగా తింటుంటారు. గుడ్లలో అత్యంత నాణ్యమైన ప్రొటీన్ ఉండే మాట నిజమే అయినా పచ్చసొనలో కొలెస్ట్రాల్, కొవ్వు కూడా ఉంటాయని మరవరాదు. ఒక గుడ్డులో 186 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజుకు మూడు గుడ్లు తినటం సాధారణంగానే పరిగణిస్తారు. అంతకన్నా ఎక్కువ తినేవారు పచ్చసొనను తీసేయటం మంచిది. దీంతో కొలెస్ట్రాల్ లేకుండానే ప్రొటీన్ లభించేలా చూసుకోవచ్చు.
సమతులంగా, సరిగా
ప్రొటీన్‌తో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఇలా ఎక్కువెక్కువ తినకుండా చూస్తుంది. అలాగే ఆలస్యంగా జీర్ణం కావటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు ఉన్నట్టుండి పెరగకుండా చూస్తుంది. దీని మూలంగానే పిండి పదార్థాలు గణనీయంగా తగ్గించి అధిక ప్రొటీన్ ఆహార పదార్థాలు తీసుకోవటమనేది ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి పేగులు ఆరోగ్యంగా ఉండటానికి పిండి పదార్థాలు చాలా ముఖ్యమనే సంగతి గుర్తించాలి. పిండి పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. కాబట్టి సమతులాహారం తీసుకోవటం ప్రధానం. ఆహారంలో సుమారు 30% ప్రొటీన్, 40% పిండి పదార్థాలు, 30% కొవ్వు ఉండేలా చూసుకోవటం ఉత్తమం.
ఎంత అవసరం?
వయసు, చేసే పనితీరులను బట్టి ప్రొటీన్ అవసరం ఆధారపడి ఉంటుంది. శారీరకశ్రమ అంతగా చేయని పెద్దవారికి ఒక రోజుకు తమ శరీర బరువులో ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. బాగా శ్రమ చేసేవారు, క్రీడాకారులకైతే 1.2 గ్రాముల నుంచి 2 గ్రాములు కావాలి. వృద్ధులు.. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారికి కండరాల మోతాదు, బలం తగ్గకుండా చూసుకోవటానికి కాస్త ఎక్కువగా.. 1 నుంచి 1.2 గ్రాములు తీసుకుంటే ప్రయోజనం కనిపించొచ్చు. కండలు పెంచుకునే బాడీబిల్డర్లకు ప్రతి కిలోకు 2.2 గ్రాములు కావాల్సి ఉంటుంది. రోజు మొత్తంలో మూడు నుంచి ఆరు సార్లు భోజనం చేయటం ద్వారా తగినంత ప్రొటీన్ లభించేలా చూసుకోవటం మంచిది.
ఆహారంతోనే లభించేలా..
ప్రస్తుతం జిమ్‌లు, స్పోర్ట్స్ దుకాణాల్లో కండరాలు పెంచుకోవటానికి బోలెడన్ని ప్రొటీన్ పొడులు, పానీయాలు, పట్టీలు అమ్ముతున్నారు. వీటిల్లో చాలావరకూ పాల నుంచి తీసిన వే ప్రొటీన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇవి ఉపయోగపడొచ్చేమో గానీ ఆహారం ద్వారా ప్రొటీన్ లభించేలా చూసుకోవటమే ఆరోగ్యకరం. ప్రొటీన్ పొడుల వంటివి ఫిట్‌నెస్ కోసం దగ్గరి దారులుగా అనిపించొచ్చు. కానీ ఆరోగ్యానికి దగ్గరి దారి ఏదీ లేదని తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సరైన పోషకాహారం తినటం ద్వారానే కండలు వృద్ధి చెందుతాయి. బలం, సామర్థ్యం పుంజుకుంటాయి. ఒకవేళ ప్రొటీన్ పొడులు, పానీయాల వంటివి వాడుతున్నట్టయితే అప్రమత్తంగా ఉండాలి. సమతులాహారం, శారీరక శ్రమతో లభించే ప్రయోజనాలకు ఇవి సాటిరావని గుర్తించాలి. రోజుకు 3 గుడ్లు సాధారణంగా సరిపోతాయి; ఎక్కువ అయితే పచ్చసొన తీసేయడం మంచిది.
సమతుల ఆహార
- ఎక్కువ కాలం కడుపు నిండిన భావన కలుగుతుంది → ఆకలి నియంత్రణ.
- ఆలస్యంగా జీర్ణం → రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి.
- పిండి పదార్థాలు (30%), ప్రోటీన్ (30%), కొవ్వు (30–40%) తగినంత ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
ఎంత ప్రోటీన్ అవసరం?
| వర్గం | అవసరం (గ్రా/కిలో శరీర బరువు/రోజు) | గమనిక |
|---|---|---|
| పెద్దవారు, తక్కువ శారీరకశ్రమ | 0.8 గ్రా | సాధారణ రోజువారీ అవసరం |
| క్రీడాకారులు, శారీరక శ్రమ | 1.2–2 గ్రా | కండరాలు పెంచుకునేందుకు |
| వృద్ధులు (65+ ఏళ్లు) | 1–1.2 గ్రా | కండర బలం, మోతాదు సురక్షితం |
| బాడీబిల్డర్లు | 2.2 గ్రా | కండరాల వృద్ధి కోసం |
- రోజు 3–6 సార్లు భోజనం → సమర్ధవంతంగా ప్రోటీన్ అందుతుంది.
ప్రొటీన్లు – ఆహారం ద్వారా పొందడం ఉత్తమం
క్రమపద్ధతిగా వ్యాయామం + సరైన పోషకాహారం → బలం, సామర్థ్యం, కండర వృద్ధి.
జిమ్ మరియు స్పోర్ట్స్ షాపుల్లో ప్రొటీన్ పొడులు, పానీయాలు అందుబాటులో ఉన్నాయి.
అవి ఉపయోగపడవచ్చు, కానీ ప్రధాన మార్గం ఆహారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















