హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. డిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్‌లో సాల్వెంట్స్ డ్రమ్స్ నిల్వ గోదాంలో మంటలు చెలరేగాయి.రసాయన ద్రావకాలు ఉన్న డ్రమ్స్ పేలుతూ రహదారిపైకి ఎగిసిపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బహదూర్‌పల్లిలో మరో అగ్నిప్రమాదం
ఇక కుత్బుల్లాపూర్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో డెకరేషన్ సామగ్రి గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న నివాస గృహానికి వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఒకే రోజులో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో నగరంలో అప్రమత్తత అవసరమైంది. ఘటనలపై అధికారులు విచారణ చేపట్టే అవకాశముంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews


















