రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేను ఎన్నికల సంఘం జూన్ నెలకు వాయిదా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడం, అలాగే రాష్ట్రంలో జనగణనకు సంబంధించిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి 25 ఏళ్లకోసారి ఓటరు జాబితాను సమగ్రంగా సవరిస్తుంది. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియ చేపట్టారు. అదే ఆధారంగా ప్రస్తుతం 2025 నాటి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా మూడు దశల్లో SIR సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి దశ బిహార్‌లో పూర్తయ్యింది. రెండో దశలో 11 రాష్ట్రాల్లో మ్యాపింగ్ పూర్తికాగా, సర్వే దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమై, ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 100 శాతం మ్యాపింగ్ పూర్తయింది.
మ్యాపింగ్ చేసిన ఓటర్ల వివరాలను సర్వే సమయంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. మొదటగా ఏప్రిల్‌లోనే సర్వే ప్రారంభించాలని భావించినప్పటికీ, జనగణన పనులు మరియు ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సర్వే జూన్‌లో ప్రారంభం కానుంది.ప్రస్తుతం రాష్ట్రంలో రెండు చోట్ల నమోదైన ఓటర్లు సుమారు 4.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో దాదాపు 2 లక్షల ఓట్లు తొలగించారు. సర్వే పూర్తయిన తరువాత మరణించినవారి పేర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఓటర్లుగా నమోదైన వారి పేర్లు కూడా జాబితా నుంచి తొలగించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















