కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంబులెన్స్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.హైదరాబాద్‌లో చికిత్స పొందిన తర్వాత పేషెంట్‌ను ఆదిలాబాద్‌కు తరలిస్తున్న అంబులెన్స్‌ను ఈ ప్రమాదం ఎదుర్కొంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ సలేహ భాను (63) అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
పేషెంట్ భర్తకు తీవ్ర గాయాలు కాగా, ఆయనను వెంటనే కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన పరిస్థితిని పరిశీలిస్తున్నారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















