హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలను అడ్డుకోవడం “సముద్ర దోపిడీ”తో సమానమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొంది.తమ భద్రతకు ముప్పు ఏర్పడితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధిస్తే, తాము కూడా గల్ఫ్ ప్రాంతంలోని రేవులను మూసివేస్తామని స్పష్టం చేసింది.
“భద్రత అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండదు” అని IRGC వ్యాఖ్యానించింది. హర్మూజ్ జలాల్లో భద్రతను తామే పర్యవేక్షిస్తామని, తమ అనుమతి లేకుండా ఏ నౌకకైనా ప్రవేశం ఉండదని వెల్లడించింది. శత్రుదేశాల నౌకలను జలసంధి గుండా అనుమతించబోమని స్పష్టం చేసింది.ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణానికి అవకాశం ఉంటుందని, ఆ మార్గంపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఐఆర్‌జీసీ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















