గూగుల్ తన వార్షిక ‘యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025’ను విడుదల చేస్తూ, భారతదేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను బయటపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృత్రిమ మేధ (AI) సాయంతో మోసపూరిత ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం మోపింది. దీనికి సంబంధించిన మరిన్ని తాజా విశేషాలు.
భారత్‌లో భారీ ప్రక్షాళన
గూగుల్ తన నివేదికలో భారత్‌ను ప్రకటనల భద్రత విషయంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా పేర్కొంది.
బ్లాక్ చేసిన ప్రకటనలు: నిబంధనలను ఉల్లంఘించిన 48.37 కోట్ల ప్రకటనలను గూగుల్ భారత్‌లో నిలిపివేసింది.
ఖాతాల రద్దు: తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన 17 లక్షల అడ్వర్టైజర్ ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేసింది.
గ్లోబల్ డేటా: ప్రపంచవ్యాప్తంగా గతేడాది మొత్తం 830 కోట్లకు పైగా చెడు ప్రకటనలను తొలగించగా, 2.49 కోట్ల అడ్వర్టైజర్ అకౌంట్లను నిలిపివేసింది.
జెమినై ఏఐ (Gemini AI) – రక్షణ కవచం
ఈ భారీ ప్రక్షాళన వెనుక గూగుల్ యొక్క అధునాతన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమినై’ కీలక పాత్ర పోషించింది.
నిజ సమయ గుర్తింపు: మోసగాళ్లు జనరేటివ్ ఏఐని ఉపయోగించి తప్పుడు ప్రకటనలు సృష్టిస్తుంటే, గూగుల్ కూడా అదే జెమినై ఏఐతో వారిని రియల్ టైమ్‌లో అడ్డుకుంటోంది.
ప్రివెంటివ్ యాక్షన్: ప్రపంచవ్యాప్తంగా తొలగించిన ప్రకటనల్లో 99% వాటిని వినియోగదారులు చూడకముందే ఏఐ వ్యవస్థలు పసిగట్టి బ్లాక్ చేశాయి.
వేగం: ఏఐ సాయంతో యూజర్ రిపోర్టులపై చర్యలు తీసుకునే వేగం 2024తో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, తప్పు లేకపోయినా అకౌంట్లను నిలిపివేసే ‘ఫాల్స్ అలారమ్స్’ 80% మేర తగ్గాయి
ప్రధాన ఉల్లంఘనలు ఇవే
భారతదేశంలో ప్రకటనల తొలగింపునకు దారితీసిన టాప్-5 కారణాలు:
ట్రేడ్‌మార్క్: ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లను అక్రమంగా వాడటం.
ఆర్థిక సేవలు: నకిలీ లోన్ యాప్‌లు, తప్పుడు పెట్టుబడి పథకాలు.
కాపీరైట్: ఇతరుల మేధో సంపత్తిని దొంగిలించడం.
పర్సనలైజేషన్ పాలసీ: యూజర్ల ప్రైవసీని దెబ్బతీసే యత్నం.
యాడ్ నెట్వర్క్ దుర్వినియోగం: గూగుల్ వ్యవస్థలనే మోసం చేసేలా ప్రకటనలు ఇవ్వడం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















