పూర్వం ఒక మంత్రి ఖజానాలో భద్రపరిచిన కొంత ధనాన్ని తస్కరించాడు. దాంతో అతడిమీద రాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. మంత్రికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసిన మంత్రి దేశం వదిలి పారిపోయాడు. అలా అనేక సంవత్సరాలు గడిచాయి. వృద్ధాప్యం మీదపడిన మంత్రి.. రాజు వద్దకు వచ్చి క్షమించమని కోరాడు.
రాజు ప్రశాంతంగా చూసి.. ‘శిక్షకు భయపడి పారిపోయావు కదా.. మరి ఇప్పుడెందుకు వచ్చావు?’ అనడిగాడు.
దానికి మంత్రి ‘మహారాజా! శిక్ష నుంచి తప్పించుకున్నానని ఆనందించాను. కానీ కర్మ నుంచి తప్పించుకోలేమని తెలుసుకున్నాను. నేను చేసిన అన్యాయానికి బాధపడని రోజంటూ లేదు. నా మనసు అనుక్షణం నన్ను నిలదీస్తూ, ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఇప్పుడే ఇంత వేదనగా ఉంది. ఇక చేసిన పాపానికి మరుజన్మలో ఎలాంటి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందోనని దుఃఖం కలుగుతోంది. అందుకే తమరు వేసే శిక్షను అనుభవించడమే మేలని గ్రహించి తిరిగొచ్చాను’ అంటూ బదులిచ్చాడు.
కర్మకు సాక్షి మనసు. మంచి చేస్తే మనుగడ సుగమం అవుతుంది. చెడుకు ఊతమిస్తే జీవితం నరకప్రాయంగా ఉంటుంది. ప్రచారంలో ఉన్న ఈ కథే అందుకు నిదర్శనం.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















