ప్రతిష్ఠాత్మక BWF థామస్ & ఉబెర్ కప్ ఫైనల్స్‌లో భారత జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు మరోసారి థామస్ కప్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
నాలుగేళ్ల క్రితం డెన్మార్క్, మలేసియా, ఇండోనేసియా వంటి అగ్రజట్లను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్ ఈసారి కూడా అదే ఘనతను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. అనుభవజ్ఞులైన కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్‌తో పాటు యువ ఆటగాడు ఆయుష్ శెట్టి జట్టుకు బలం అందిస్తున్నారు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జోడీ తిరిగి రావడం భారత్‌కు పెద్ద బలం. గ్రూప్-ఎలో ఉన్న భారత పురుషుల జట్టు శుక్రవారం కెనడాతో, ఆస్ట్రేలియాతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో తలపడనుంది.
ఇక ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. పీవీ సింధు నాయకత్వంలో తన్విశర్మ, దేవిక, ఉన్నతి హుడా, ఇషారాణి బారువా వంటి యువ క్రీడాకారిణులు సింగిల్స్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ జోడీ గాయం కారణంగా దూరమవడం భారత్‌కు పెద్ద నష్టం. డెన్మార్క్, ఉక్రెయిన్, చైనా వంటి బలమైన జట్లతో భారత్‌కు ఉబెర్ కప్‌లో కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. 2014, 2016లో కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించాలనే లక్ష్యంతో ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















