తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. మొత్తం సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 23 నాటికి పూర్తయింది.
మొదట మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపినప్పటికీ, తాజాగా ఈనెల 29న ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఈనాడు.నెట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో సులభంగా చూసుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















