అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో, వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎదురుకాల్పులు జరిపారు.ఈ ఘటన సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్‌లోకి తీసుకున్నారు.
ఘటనకు కొద్దిసేపటి ముందే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ మార్గంలో వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు ఆయనను లక్ష్యంగా చేసుకుని జరిగాయనే ఆధారాలు లేవని యూఎస్ సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మాథ్యూ క్విన్ తెలిపారు.
ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమయంలో కూడా కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నారు.తాజా ఘటనకు ఆ సంఘటనతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















