బుధవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ సూచీలు లాభాలను కోల్పోయి దోబూచులాడుతున్నాయి. ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల్లో కొనసాగుతుండగా, రియాల్టీ రంగం సూచీలపై ఒత్తిడిని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది.
ప్రస్తుతం సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.79 వద్ద ఉంది.
గత సెషన్‌లో 77,958 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 78,339 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత లాభాలు తగ్గుతూ ఉదయం 10 గంటల సమయానికి 106 పాయింట్ల లాభంతో 78,065 వద్ద కొనసాగుతోంది.
ఇక నిఫ్టీ కూడా ఇదే ధోరణిలో కదులుతోంది. ప్రస్తుతం 39 పాయింట్ల లాభంతో 24,370 వద్ద ట్రేడవుతోంది.
స్టాక్ స్పెసిఫిక్‌గా చూస్తే పేటీఎమ్, పాలీక్యాబ్, సీజీ పవర్, శ్రీ సిమెంట్స్, హిటాచీ ఎనర్జీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్, కేపీఐటీ టెక్, పీబీ ఫిన్‌టెక్, కేఈఐ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 162 పాయింట్ల లాభంతో ఉండగా, బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేసింది. మొత్తంగా మార్కెట్ లాభనష్టాల మధ్య కదులుతూ మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















